రవీనా టాండన్‌పై కేసు నమోదు..

  • In Film
  • December 27, 2019
  • 149 Views
రవీనా టాండన్‌పై కేసు నమోదు..

ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పై కేసు నమోదైంది. నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఎవరినీ కించపరిచేలా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. టెలివిజన్ షోలో తాను మాట్లాడిన ఒరిజినల్ క్లిప్ షేర్ చేస్తున్నాననిఅందరూ దీన్ని చూడాలని ట్విట్టర్ లో క్లిప్‌కు సంబంధించిన లింక్ ను షేర్ చేశారు. తాను ఎవరిపైనా కించపరిచే వ్యాఖ్యలు చేయలేదనిఒకవేళ ఎవరైనా అలా భావిస్తే, వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. టీవీ షోలో క్రిస్టియన్ సామాజికవర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ రవీనా టాండన్, కమెడిన్ భారతి సింగ్, దర్శకనిర్మాత ఫరా ఖాన్ లపై పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. నేపథ్యంలో వీరి ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.  పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్ గా నిర్వహిస్తున్నబ్యాక్ బెంచర్స్అనే రియాలిటీ షోలో రవీనా టాండన్ దర్శకురాలు ఫరా ఖాన్ లు పాల్గొన్నారు. షో లో భాగంగా వీరిని హోస్ట్ భారతీ సింగ్హలలూయాకి స్పెల్లింగ్ రాయమని అడిగింది. దానికి వారు తమ సమాధానాన్ని బోర్డు పై వేరు వేరుగా రాశారు. తరువాత ఇద్దరు కలిసి స్పెల్లింగ్స్ పై షోలో కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.దీనితో వారు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ క్రిస్టియన్ మతస్థులు రవీనా ఫరా ఖాన్ భారతీ సింగ్ తమ మతాన్ని కించపరిచారంటూ అంజాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos