ఆక్సిజన్​ అందక 10 మంది రోగులు మృతి

ఆక్సిజన్​ అందక 10 మంది రోగులు మృతి

న్యూ ఢిల్లీ: ఆక్సిజన్ అందక రెండు వేర్వేరు చోట్ల పది మంతి మృతి చెందారు. ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రైవేటు ఆస్పత్రిలో ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం వల్ల ఐదుగురు మరణించారు. ‘మంగళవారం రాత్రి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని తెలుసుకున్న యాజమాన్యం.. 20 సిలిండర్లను ఏర్పాటు చేసింది. కానీ తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. యాజమాన్యం సిలిండర్లను ఏర్పాటు చేసే లోపే ఐదుగురు మృతి చెందార’ని హరి ద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేపడతామనీ వెల్లడించారు. కర్ణాటక హుబ్బళ్లి గోగుల్ రోడ్డులోని లైఫ్లైన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తి ఐదుగురు రోగులు మరణించారు.మృతుల్లో శ్రీనగర్కు చెందిన శ్రేయస్ ధ్రునావత్(35), సన్మాన్ కాలనీకి చెందిన బాలచంద్ర దండగి(62), సిర్సీ అమినహాలికి చెందిన వినయ నాయక్(47), వెంకటేశ్ జైన్(52)లతో పాటు నాలుగు రోజుల కిందట వివాహం జరిగిన ఓ యువకుడు ఉన్నాడు. జిల్లా ఆరోగ్య అధికారి యశ్వంత్ మెదినక ఆసుపత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆసుపత్రి వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos