న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 69,652 కరోనా కేసులు నమోదయ్యాయి. 977 మంది కరోనా కాటుకు మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఇక్కడ వెల్లడించింది. 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మొత్తం కేసుల సంఖ్య 28,36,926కు చేరింది. మృతుల సంఖ్యా 53,866కి పెరిగింది. 6,86,395 మంది వా్ధితో బాధపడుతున్రాఉ. 20,96,664 మంది కోలుకుని విడుదలయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం .మరణాల రేటు 1.9 శాతమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.