కరోనా తగ్గుముఖం

కరోనా తగ్గుముఖం

న్యూ ఢిల్లీ:  కరోనా మహమ్మారి  కాస్త శాంతించింది. కొత్త కేసుల పెరుగుదలలో తగ్గుదల కనిపించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 7 వేల కంటే తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం గత 24 గంటల్లో 179 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక నిన్నటి వరకూ 7 వేలకుపైనే ఉన్న యాక్టివ్‌ కేసులు ఇప్పుడు ఆరువేలకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 6836 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,659, గుజరాత్‌లో 1,248, పశ్చిమ బెంగాల్‌లో 747, కర్ణాటకలో 696 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజు మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 109కి ఎగబాకింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos