న్యూ ఢిల్లీ:దేశంలో గత 24 గంటల్లో 200కి పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,437, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్నమహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. ఇప్పటి వరకూ 11,967 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.