24 గంటల్లో 117 కొత్త కేసులు

24 గంటల్లో 117 కొత్త కేసులు

న్యూ ఢిల్లీ:దేశంలో కరోనా గత 24 గంటల్లో 117 మందికి సోకింది. ముగ్గురు మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ లో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615 కేసులు, కర్ణాటకలో 467, ఉత్తరప్రదేశ్‌లో 231, ఉత్తరప్రదేశ్‌లో 227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 77కి చేరింది. ఇప్పటి వరకూ 9,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos