న్యూ డిల్లీ ; దేశంలో కరోనా కేసులు మరోసారి తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 25,920 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 492 మంది మరణించారు. 66,254 మంది బాధితులు కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 2.07 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.మొత్తం మరణాలు: 5,10,905,యాక్టివ్ కేసులు: 2,92, 092, కోలుకున్నవారు: 4,19,77,238, దేశ వ్యాప్తంగా గురువారం 12,54,893 కరోనా పరీక్షలు చేశారు.