కేర్ ‘లెస్’ సిబ్బందికి అంజలి బలి

కేర్ ‘లెస్’ సిబ్బందికి అంజలి బలి

శ్రీకాకుళం: రాజాంలో అమానవీయ ఘటన సంభవించింది. డబ్బులు ఉన్నప్పటికీ వాటిని తీసుకునే పరిస్థితి లేకపోవడంతో కరోనా బాధితురాలు పెంట అగ్రహారం వాసి అంజలి రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. అంజలిని ఇక్డి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకు వచ్చారు. నగదు ఇస్తనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని సిబ్బంది స్పష్టం చేశారు. ఆన్లైన్ చెల్లింపునూ నిరాకరించారు. దీంతో బాధితు రాలి బంధువులు ఏటీఎంల చుట్టూ మూడు గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలి పరిస్థితి విషమించడంతో రోడ్డుపై చనిపోయింది. మృతురాలిది రాజాం మండలం పెంట అగ్రహారం . కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos