విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గౌతమ్ దివ్యాంగుల కోసం స్టీరింగ్ లేని కారును తయారు చేశారు. గీతం యూనివర్శిటీలో ఎంఎస్సీ డేటా సైన్స్ చదువుతున్న అతను తన అధ్యాపకుల సలహాల మేరకు ఓ వెల్డర్ సాయంతో ఈ కారును ఉత్పత్తి చేశాడు. సౌర శక్తి, బ్యాటరీల సాయంతో ఈ కారు నడుస్తుంది. చేతులు లేని దివ్యాంగులకు ఇదెంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీని కోసం తాను రూ.30 వేలు ఖర్చు చేశానని, దేశంలోనే తొలిసారిగా తయారు చేసినందున పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని గౌతమ్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కారు గీతం క్యాంపస్లో తిరుగుతూ ఆకర్షణగా నిలిచింది.