అమరావతి : అభివృద్ధికి అత్యరత కీలకమైన సంపద సృష్టిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పెట్టుబడి వ్యయం కిరద ఎనిమిది నెలల్లో కేవలం ఏడు వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు తేలింది. అరటే నెలకు వెయ్యి కోట్లు కూడా లేదు. గత ఏడాది తొలి ఎనిమిది నెలల్లో రూ. 17 వేల కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క అక్టోబర్ నెలలోనే 3,105 కోట్లు ఖర్చు చేయగా, ఆగస్టులో 1,314 కోట్లు ఖర్చు చేశారు. ఇక మిగిలిన అన్ని నెలల్లో నామమాత్రంగానే ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యల్పంగా మే నెల్లో 228 కోట్లు, జూన్‌లో 465 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాది తొలి నాలుగు నెలలూ రెండు వేలకోట్లకుపైగానే ఖర్చు చేయగా, ఒక్క ఏప్రిల్‌లోనే 5,532 కోట్లు ఖర్చు చేశారు.రాష్ట్రాభివృద్ధికి కీలకమైన శాఖల్లో నామమాత్రము ఖర్చు కనిపిస్తోంది. విద్యాశాఖలో గతేడాది 481 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది 239 కోట్లే ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. తాగునీటికి సంబంధించి గత ఏడాది 390 కోట్లు పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయగా, ఈ ఏడాది 155 కోట్లకే పరిమితం కానున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో కూడా గత ఏడాది కన్నా ఈ ఏడాది తక్కువ మొత్తమే పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయనున్నారు. మరో కీలక రంగమైన గ్రామీణాభివృద్ధిలో కూడా పెట్టుబడి వ్యయం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. గత ఏడాది 784 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది కేవలం 195 కోట్లే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.