దాడికి దిగిన మోదీకి గట్టిగా బదులిస్తాం

అమరావతి: దేశంలోని రాజ్యంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి తమపై దాడికి దిగిన ప్రధాని నరేంద్ర మోదీకి గట్టిగా బదులివ్వాలని ముఖ్య మంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లోని తెదేపా కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.ఇష్ట మొచ్చినంత మంది అధికార్లను బదిలీ చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. ప్రజలు ప్రతి దాన్ని గమనిస్తున్నారని, తగిన నిర్ణయాన్ని చేస్తారని వ్యాఖ్యానించారు. భాజపా పెడ బుద్ధికి ఆర్బీఐ గవర్నర్లు సైతం రాజీనామా చేసి వెళ్లి పోయారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం విచ్చల విడిగా సాగుతోందని మండిపడ్డారు. అన్నివ్యవస్థల్ని కట్ట గట్టి ఏకంగా తెదేపాపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పక్షాల్ని తెదేపా ఏక తాటిపైకి తెస్తున్నందుకు భాజపా అక్కసుతో కుతకుతలాడుతోందని దుయ్యబట్టారు. భాజపా నేతల వల్లే సీబీఐ భ్రష్టు పట్టి పొయిందని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘానికే పోట్లు, తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
తెరాస దర్శకత్వంలో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇవి పెచ్చు మీరి అధికారులనూ బదిలీ చేయించే స్థాయికి వచ్చారని మండి పడ్డారు. అరాచకమే ప్రధాన అజెండాగా ఎన్నికలకు పోతున్నారని వ్యాఖ్యానించారు. 31 అవినీతి ఆరోపణ కేసుల్ని ఎదిరిస్తున్న వారు చేసిన ఫిర్యాదుల్లో ఏమైనా నిజం ఉంటుందాని ప్రశ్నించారు. ‘మరిన్ని వీవీ ప్యాట్ లెక్కించాలని 22 పార్టీలు చేసిన వినతిని తిరస్కరించిన ఎన్నికల సంఘం నిందితులు చేసిన ఫిర్యాదులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకోవటంలో ఆంతర్యం ఏమిటన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos