నాగచైతన్యను
పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మారాకా సమంత హోదా కూడా మారింది.అప్పటి వరకు కేవలం
ఒక హీరోయిన్‌గా మాత్రమే గుర్తింపు కలిగిఉన్న సమంత చైతూతో పెళ్లి అనంతరం అక్కినేని వంశానికి
కోడలు అనే బ్రాండ్ పొందింది.దీంతో తను వాడే ప్రతీ వస్తువు కూడా బ్రాండెడ్ అయి ఉండాలనే
నియమాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది.మామూలుగానే తన బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత
ఇచ్చే సమంత అక్కినేని కోడలు అయ్యాక మరింత కేర్ తీసుకుంటోంది.ఈ క్రమంలో ఓ మొబైల్ కంపెనీ
నిర్వహించిన ఈవెంట్‌లో సమంత పాల్గొనగా అందరి చూపులు సమంత పాదరక్షలపైనే నిలిచాయి.ఎందుకుంటే
సమంత ధరించిన పాదరక్షల విలువ అక్షరాల లక్ష రూపాయాలు.టాప్ సెలబ్రిటీల్లో అతికొద్ది
మంది మాత్రమే ఈ పాదరక్షలు ధరిస్తారని సీనివర్గాలు చెప్పుకొంటారు.పెరు రాజధాని లిమాలో
మాత్రమే లభించే ఈ పాదరక్షలు మెనోలో బ్లాహ్నిక్ అనే స్పానిష్ సంస్థ మాత్రమే తయారు
చేస్తుంది.పాదాలకు తగ్గట్లుగా హీల్స్ ఒదిగిపోవడం ఈ పాదరక్షల ప్రత్యకతగా చెప్పుకొంటారు..