ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడుకు కొడుకు లోకేశ్ పోటీపై కొత్త చిక్కు వచ్చి పడింది.తాను చేసిన వ్యూహాత్మక
తప్పిదాలే చంద్రబాబుకు ఈ పరిస్థితి తలెత్తినట్లు చర్చలు సాగుతున్నాయి.సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఖరారు కాగానే… మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గంతో కుదిరిన ఒప్పందం మేరకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ గిరీకి రాజీనామా చేసేశారు.తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనను నాలుగుసార్లు ఓడించిన సర్వేపల్లి నియోజకవర్గం
నుంచి ఎన్నికల బరిలో ప్రత్యక్ష్య పోరుకు సిద్ధమయ్యారు.రామసుబ్బారెడ్డి,సోమిరెడ్డి రాజీనామాలకు మండలి చైర్మన్ ఆమోద ముద్ర కూడా వేశారు. ఇద్దరు
రాజీనామాలతో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయక తప్పదన్న సంకేతాలను తెదేపా తన నేతలకు పంపినట్లయింది.దీంతో
ఎమ్మెల్సీ కోటాలోనే మంత్రి పదవి అలంకరించిన బాబుగారి కుమారుడు లోకేశ్ కూడా ప్రత్యక్ష్య
ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దూకాల్సిన
పరిస్థితులు తలెత్తాయి. మరి లోకేశ్ చేత చంద్రబాబు ఎమ్మెల్సీ గిరీ రాజీనామా చేయిస్తారా? ఒక వేళ లోకేశ్ రాజీనామా చేస్తే.. మంత్రి పొంగూరు నారాయణ కూడా రాజీనామా చేయాల్సిందే కదా. ఇవన్నీ జరిగేనా?ఒకవేళ
అందుకు తన కొడుకును మినహాయించడానికి ప్రయత్నిస్తే మిగిలిన నేతలు ఎదురు తిరగడం ఖాయం.మరోవైపు
లోకేశ్‌ను ఎక్కడి నుంచి బరిలో దించాలనే విషయంపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు
సమాచారం.రాజకీయాల్లో్ ఇంకా పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్న లోకేశ్‌పై ప్రజల్లో ఇప్పటికే
వ్యతిరేకత ఉండడంతో సునాయాసంగా విజయం సాధించే నియోకవర్గంపై తండ్రీకొడుకులు ఆరా తీస్తున్నట్లు
సమాచారం.ఇప్పటికే తనకు ఓ నియోజకవర్గాన్ని కూడా ఖరారు చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆ సేఫ్ జోన్ ఏదన్న విషయంపై గుంభనంగానే వ్యవహరిస్తున్న లోకేశ్… అసెంబ్లీ బరికి సిద్ధమైనట్టుగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.