హొసూరు యూనియన్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

హొసూరు యూనియన్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

హొసూరు :  హొసూరు యూనియన్‌లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు తొలి విడత ఈ నెల 27న, మలి విడత 30న జరుగనున్నాయి. తొలి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత వారం రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. క్రిష్ణగిరి జిల్లాలోని 10 యూనియన్లలో  పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగించారు. తొలి విడత ఎన్నికలకు నేటితో ప్రచారం ముగిసింది. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ ఓట్లను అర్థించారు. హొసూరు సమీపంలోని బాగలూరులో బీజేపీ, ఏడీఎంకే, డీఎంకే తదితర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos