వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16న గుంటూరు జిల్లా గురజాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు రాత్రి తాడేపల్లిలో బస చేస్తారు. 17న నర్సీపట్నం, నెల్లమర్ల, గన్నవరంలలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. మరో వైపు వైఎస్. విజయమ్మ, షర్మిలలు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాలు చొప్పున వారి ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తారు.