గౌహతి : రాష్ట్రంలో తాము అధికారం చేపడితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం లహోవాల్లో విద్యార్థులు, యువతతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం క్షీణించడానికి, నిరుద్యోగం పెరగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని కారణమని విమర్శించారు. బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) దేశాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.