న్యూ ఢిల్లీ : బీజేపీ అంటే -బర్డన్ జనతా పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. బీజేపీ దోపిడీకి వ్యతిరేకంగా అందరూ గళ మెత్తాలని పిలుపు నిచ్చారు. తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని కోరారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి అని ట్వీట్ చేసారు. ‘ధరల పెరు గుదల అనేది ఓ శాపం. పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం రుణాల ఊబిలోకి నెట్టేస్తోంది. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోంది. దానికి వ్యతిరే కంగా అందరూ గళమెత్తాల’ని అభ్యర్థించారు. దీంతో పెట్రో ధరల వీడియోనూ జత పరిచారు.