కర్ణాటకలో కుప్పకూలిన భవనం

కర్ణాటకలో కుప్పకూలిన భవనం

ధార్వాడ : కర్ణాటకలోని ధార్వాడ పట్టణంలో ఉన్న కమలేశ్వర నగరలో మంగళవారం ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద వంద మంది వరకు ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక పనులు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ భవంతి ఒకటి, రెండు అంతస్తుల నిర్మాణం పూర్తయి, పలువురు అద్దెకు ఉంటున్నారు. అయిదో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా, మొత్తం భవనమే కుప్పకూలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos