న్యూ ఢిల్లీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ సహా పలు పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు సంయమనం పాటించాలంటూ స్పీకర్ ఓం బిర్లా వారికి సూచించారు. ప్రస్తుతం నిర్మల బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.
.