చంఢీఘడ్ పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల ఉగ్రవాదులు పఠాన్కోట్, గురుదాస్పూర్ జిల్లాల్లో దాడులకు పాల్పడే అవకాశ ముం దని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించటంతో పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. ఐదు వేల మంది సాయుధ పోలీసులు, కేంద్ర బలగాలు రెండు జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. వాహనాల తనిఖీలు ఆరంభించారు. పఠాన్కోట్, గురుదాస్పూర్, బటాలా ఆసుపత్రుల్లో కనీసం ఎనిమిదేసి పడకలను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని భద్రతా బలగాలు ఆదేశించాయి. మొత్తం మీద సాయుధ బలగాల గాలిం పుతో పం జాబ్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం భయాందోళనలు చెందుతున్నారు