సినిమాల ప్రభావం
యువతపై ఎంత ప్రభావం చూపుతాయో తాజాగా కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ భీకర హత్య మరోసారి
రుజువు చేసింది.కేరళలో రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి అనంత్ అనే డ్రగ్ డీలర్‌కు అదే
ప్రాంతానికి చెందిన మరొక డ్రగ్ డీలర్ విష్ణురాజ్కు మధ్య చాలా కాలంగా శత్రుత్వం ఉంది.ఇదే
విషయంపై అనేకసార్లు ఘర్షణ పడ్డ ఇరువురు తాజాగా జరిగిన ఓ జాతరలో కూడా తీవ్రంగా కొట్టుకున్నారు.కాగా
గత ఏడాది విడుదలైన కేజీఎఫ్ చిత్రం తన వృత్తికి దగ్గరగా ఉండడంతో అందులో హీరోగా తనను
తాను ఊహించుకొని కేజీఎఫ్ చిత్రంపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న విష్ణురాజ్ కేజీఎఫ్
చిత్రంలో హీరో తన శత్రువులను మట్టుబెట్టిన రీతిలోనే తన శత్రువైన అనంత్‌ను కూడా హత్య
చేయడానికి నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో తన గ్యాంగులోని 13 మంది సహచరులతో కలసి అనంత్‌ను
అపహరించిన విష్ణురాజ్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా అనంత్‌ను హత్య
చేశాడు.హత్య చేసిన తతంగం మొత్తాన్ని వీడియో తీసిన విష్ణురాజ్ వీడియోలో కేజీఎఫ్ చిత్రంలో
హీరో చెప్పే రెండు మూడు డైలాగులు కూడా గర్వంగా చెబుతూ కనిపించాడు.కేసు నమోదు చేసుకున్న
పోలీసులు నిందితులందరిని అరెస్ట్ చేసి హత్య జరిగిన తీరు,విష్ణురాజ్ ప్రవర్తనతో విస్మయం
చెందారు..