చేసిందేమీ లేకనే మోదీ పాక్ జపం: బృందా కారత్

చేసిందేమీ లేకనే మోదీ పాక్ జపం: బృందా కారత్

నల్లగొండ: ప్రజలకు చేసిన మేలు లేనందునే పాకిస్థాన్ పేరు చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లడుగుతున్నారని సీపీఎం నాయకురాలు బృందాకారత్ మంగళవారం ఇక్కడ విమర్శించారు. ఆయన దేశాన్ని తిరోగమనంలో తీసుకెళ్లారని నిప్పులు చెరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఎంకి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ‘‘బీజేపీ హఠావో.. దేశ్కో బచావో’’ అనేది తమ నినాదం అని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు లేక దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. దేశంలో సెక్యూలర్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామంటూ కాంగ్రెస్కు ఒక నిర్ధిష్టమైన విధానం ఏదీ లేదని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos