పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌.. స్టే ఇచ్చేందుకు నిరాక‌ర‌ణ‌

పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌.. స్టే ఇచ్చేందుకు నిరాక‌ర‌ణ‌

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌కు హైకోర్టు షాకిచ్చింది. దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ హ‌రి, తెల్లం వెంక‌ట్రావుల‌కు హై కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజ‌న్ బెంచ్ నిరాక‌రించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హై కోర్ట్‌ డివిజన్‌ బెంచ్ అభిప్రాయ‌ప‌డింది. ఈ నెల 24న వాదనలు వింటామని డివిజన్‌ బెంచ్ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌వాల్ చేశారు. దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీహ‌రి, తెల్లం వెంక‌ట్రావుల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని గ‌తంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos