వెలుగు చూసిన ధనుష్కోటి వంతెన

వెలుగు చూసిన ధనుష్కోటి వంతెన

రామేశ్వరం: దాదాపు ఐదున్నర దశాబ్ధాల తర్వాత వెలుగు చూసిన ధనుష్కోడి వంతెన పర్యాటకులకు ప్రముఖ ఆకర్షణగా మారింది.బ్రిటిష్ పాలకులు 1914లో రామేశ్వరం-ధనుష్కోడి మధ్య రహదారి నిర్మించారు. 1964లో సంభవించిన భారీ తుపాను ధాటికి ధనుష్కోడిలోని వినాయక ఆలయం, రైల్వేస్టేషన్, అక్కడి వంతెనలు పలు భవనాలు, ఇతర నిర్మాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. దరిమిలా రామేశ్వరం , ధనుష్కోటి మధ్య రాకపోకలు అనివార్యంగా ఆగి పోయాయి. ప్రత్యామ్నాయ మార్గంలో వాహన సంచారం సాగుతోంది. 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో ధనుష్కోటికి జాతీయ రహదారి నిర్మించారు. ప్రస్తుతం భారీగా వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిని ఇసుక కోత వల్ల 1964 తుపాను దెబ్బకు పూడిపోయిన 20 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవైన వంతెన బయటపడింది. వంతెన నిర్మాణానికి వినియోగించిన సిమెంట్ గొట్టాలు, రక్షణ గోడ దెబ్బ తినకుండా ఇప్పటికీ పటిష్టంగా ఉండటం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos