మందు తక్కువైందని వరుడి హత్య

మందు తక్కువైందని వరుడి హత్య

లఖ్నవ్: చాలినంత మద్యం తెప్పించలేదన్న ఆగ్రహంతో వరుడిపై అతని మిత్రులే కత్తితో దాడి చేసి చంపారు. పాలిముకిల్ పూర్ కు చెందిన బబ్లూకు సోమవారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశాడు. వారిని పలకరించేందుకు వెళ్లిన అతడిని మిత్రబృందం మరింత మద్యం కావాలని అడిగారు. తాగినంత వరకూ చాలని, ఇంకా ఎక్కువగా తాగవద్దని బబ్లూ కోరడంతో వివాదం మొదలైంది. విచక్షణ కోల్పోయిన స్నేహితులు బబ్లూపై కత్తితో దాడి చేశారు. బబ్లూ తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రామ్ ఖిలాడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos