విశాఖ ఘోరం ఫోటోలు..

విశాఖ ఘోరం ఫోటోలు..

విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కర్మాగారం నుంచి గ్యాస్‌ లీకైన ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు బయటకు వచ్చాయి.కర్మాగారం నుంచి గ్యాస్‌ లీకవుతున్న ఫోటోలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ల్లవారుజామున ఘాటు వాసనతో ఒక యువకుడు నిద్ర లేవటం.. కళ్ల ముందు ఎల్ జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి ప్రమాదకర వాయువు విడుదలవుతున్న వైనాన్ని ఫోటోలు తీసినట్లుగా గుర్తించారు. ఫోటోల్ని చూస్తే.. క్షణాల వ్యవధిలోనే వాయువు చుట్టుపక్కల ప్రాంతాల్ని చుట్టేసిందన్న వైనం అర్థమవుతుంది.తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. క్రమంలో పలువురు రోడ్ల మీదనే పడిపోయారు. సమయంలోనే ఒక అపార్ట్ మెంట్ లోని ఐదో అంతస్తులో ఉండే యువకుడు గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గుర్తించి.. వెంటనే తన దగ్గరున్న కెమేరాతో.. ఫోటోల్ని తన ఫ్లాట్ నుంచి తీశాడు. అతడు ఫోటోలు తీసే సమయానికే గ్యాస్ ప్లాంట్ అంతా వ్యాపించింది. కాసేపటికే ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామంలోకి ప్రవేశించింది. క్షణాల్లో గ్యాస్ గ్రామాల్ని చుట్టుముట్టిన వైనం తాజా ఫోటోలతో బయటకు వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos