మళ్లీ బరిలో దిగుతున్నా..మైక్ టైసన్

మళ్లీ బరిలో దిగుతున్నా..మైక్ టైసన్

ప్రపంచంలో బాక్సింగ్‌ క్రీడకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.రక్తపాతం,హింస ఎక్కువగా ఉండే ఈ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ఇక ఈ క్రీడలో మైక్‌ టైసన్‌ ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ నెగ్గి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమెరికా జాతీయుడు తర్వాత ఎదురులేని ప్రస్థానం సాగించాడు. కెరీర్ చివర్లో అనేక వివాదాలు టైసన్ ప్రతిష్ఠను మసకబార్చినా, అతడి బాక్సింగ్ నైపుణ్యం, సాధించిన విజయాలు అభిమానులకు చిరస్మరణీయం. ప్రపంచ బ్యాక్సింగ్ రంగంలో ఎంతోమంది వచ్చినా మైక్ టైసన్ కు వచ్చినంత ప్రాచుర్యం మరెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థిని ఒక్క పంచ్ తో నాకౌట్ చేయగల పవర్ మైక్ టైసన్ సొంతం.ఇక 2005లో రైటర్మెంట్‌ ప్రకటించిన టైసన్‌ మళ్లీ ఇన్నాళ్లకు రింగ్‌లోకి దూకబోతున్నాడు.అయితే ఇది కేవలం ఓ స్వచ్చంద సంస్థకు నిధులు సేకరించే ఉద్దేశంతో మాత్రమే. గతవారం టైసన్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. 53 ఏళ్ల వయసులోనూ తనలో పదును ఏమాత్రం తగ్గలేదని చెబుతూ విపరీతమైన వేగంతో పంచ్ లు విసురుతూ వీడియోలో దర్శనమిచ్చాడు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన మరో వీడియోలో వర్కౌట్లు చేస్తూ అభిమానులను అలరించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos