అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండు చేస్తూ రైతులు శుక్రవారం ఉదయం విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని నాయకులు ముట్టిడించారు. ఇందుకు టీఎన్ఎస్ఎఫ్ ఏపీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం నాయకత్వం వహించారు. బొత్స మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. పోలీసులు వారిని సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.