అమరావతి:‘రాజధానిపై స్పష్టత కోసం సమితిని నియమించాం. సమితి నుంచి నివేదిక వచ్చిన తర్వాత పూర్తి రాజధాని గురిం చి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే తుదిద’ని మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ తెలిపా రు. అమరా వతి రైతులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయా లని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. శాసనసభ సమావేశాలు సజావుగా కొనసాగకుండా వారు భ్యులు అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. భోగాపు రం విమానాశ్రయ నిర్మాణానికి మళ్లీ టెండరింగ్ కు వెళ్లే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.