కోల్కతా : ప్రజాస్వామ్య దేశంలో పౌరులపై చట్టాలను బలవంతంగా రుద్ద రాదని పశ్చిమ బెంగాల్ భాజపా అధినేత , నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ అన్నారు. నూతన పౌరసత్వ చట్టం గురించి సోమవారం ఇక్కడ జరిగిన సభలో ఆయన ప్రసం గించారు. ‘ప్రజలకు ఏది మంచో.ఏది చెడో చెప్పడం వరకే మన బాధ్యత. కేవలం సంఖ్యాబలం ఉందని ప్రజలను వేధించరాదు. ఉగ్ర రాజకీయాలకు పాల్పడరాదు. ప్రజలకు సీఏఏ ప్రయోజనాలను వివరిద్దాం. చట్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కట్టుబడి ఉండటం బాధ్యత. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై ఏ చట్టాన్నీ రుద్దలేము. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేను ముసాయిదాకు పలు సవరణలు సూచించాను. అణగారిన మైనారిటీలకు ఈ బిల్లు ఉద్దేశించింది. మతం ప్రస్తావన లేకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన వైఖరి భిన్నంగా ఉండాల్సింద’ని పేర్కొన్నారు.