సరిహద్దుల మూసివేత

సరిహద్దుల మూసివేత

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లోని తనిఖీ కేంద్రాల్ని ఆది వారం నుంచి మూసి వేయాలని కేంద్రం నిర్ణయించింది. సరిహద్దుల్లో మొత్తం 37 వలస దార్ల తనిఖీ కేంద్రాలున్నాయి. వీటిలో 19 కేంద్రాలు శని వారం అర్ధరాత్రి వరకు పని చేయనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని తనిఖీ కేంద్రాలు మూత పడనున్నాయి. నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీ యులు దేశంలోకి రాకుండా అడ్డు కోవాలని హోంశాఖ ఆదేశించింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ప్రత్యేక వార్డులకు తరలించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos