విజయవాడ : కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పు కోవటం సరికాదని తెదేపా నేత బోండా ఉమా మహేశ్వర రావు వ్యాఖ్యానించారు. సోమ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నాయకత్వం వహించే వారిపై విమర్శలు సహజమే. ముద్రగడపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసేది వైసీపీ వాళ్లే. ముఖ్యమంత్రి జగన్కు ముద్రగడ కాపుల రిజర్వేషన్ల గురించి లేఖ రాసిన తర్వాతే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇది నిజంగా కాపులకు జగన్ చేసిన ద్రోహం. కాపు జాతి కోసం, రిజర్వేషన్ల కోసం ముద్రగడ ముందుకు రావాల’ని విన్నవించారు. త్వరలో 13 జిల్లాల కాపు నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.