న్యూయార్క్: సముద్ర మట్టాలు పెరుగుతున్నందున 2050కల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చాలా భాగం మునిగిపోనుందని న్యూజెర్సీలోని క్లైమేట్ సెంట్రల్ అనే సైన్స్ ఆర్గనైజేషన్ అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం 2050 నాటికి 15 కోట్ల ప్రజలు నివసిస్తున్న భూమి సాగరపు ఎత్తయిన అలల ధాటికి కుంగి పోనుంది. ముంబయికీ ఇది వర్తించనుంది. వాణిజ్య ప్రాంతాల విస్తరణ, భవంతుల నిర్మాణాల వల్లే ఈ ముప్పు. ప్రస్తుతమున్న ముంబై ఒకప్పుడు ద్వీపాల సమాహారం. అవన్నీ కలసి ముంబై నగరంగా ఆవిర్భవించింది. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత భూ భాగంలోకి ఎలా చొచ్చుకు పోతాయనే అంశాలనూ అధ్యయనం చేసారు. దక్షిణ వియత్నాం పూర్తిగా మరుగయ్యే ప్రమాదముంది. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి పాల కులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంద’ని అంతర్జాతీయ వలసల సంస్థ సలహా ఇచ్చింది.