తిరుపతిలో బాంబు పేలుడు..

తిరుపతిలో బాంబు పేలుడు..

తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నాటు బాంబు పేలడం కలకలం రేపింది. గత రాత్రి శునకం నాటుబాంబును కరచుకుని ఆసుపత్రి ఆవరణలోకి వచ్చింది. చాలా సేపటి నుంచి దానిని అది గట్టిగా పట్టుకుని ఉండడంతో ఒత్తిడికి ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనలో బాంబు కరచుకు వచ్చిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది.బాంబు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాటుబాంబును శునకం ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos