ఇండియన్‌ ఘోస్ట్‌ రైడర్‌…

  • In Film
  • March 6, 2019
  • 167 Views

తన చిత్రాల్లోని పోరాట సన్నివేశాల్లో సహజత్వం కోసం అప్పుడప్పుడూ రిస్కీ స్టంట్లు చేసే బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తాజాగా అటువంటిదే స్టేజ్‌పై రిస్కీ స్టంట్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.తన కొత్త చిత్రం కేసరి ప్రమోషన్‌,వెబ్ సిరీస్‌ లాంఛింగ్ కార్యక్రమాల్లో భాగంగా ముంబయిలో నిర్వహించిన పబ్లిక్‌ ఈవెంట్‌లో ఒంటికి నిప్పంటించుకొని చేసిన రిస్కీ స్టంట్‌ ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.కేసరి చిత్రంలో కూడా ఇటువంటి సన్నివేశం ఉండడంతో అదే స్టంట్‌ను స్టేజ్‌పై కూడా చేశాడు.అయితే పబ్లిక్‌ ఈవెంట్‌లో ఇటువంటి రిస్కీ స్టంట్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అక్షయ్‌ చేసిన స్టంట్‌ను ఎవరైనా అనుకరించడానికి ప్రయత్నిస్తే బాధ్యులు ఎవరంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు.కాగా అక్షయ్‌ చేసిన స్టంట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.స్టంట్‌ చేయడానికి ముందు అక్షయ్‌ అండ్‌ టీమ్‌ చాలా జాగ్రత్తలు పాటించారు.మంటలు ఒంటికి అంటుకోకుండా యాంటీ ఫైర్‌ప్రూఫ్‌ రాసుకున్నాడు.అనంతరనం ఇంటిపై ఫైర్‌ప్రూఫ్‌ జాకెట్‌ ధరించాడు.ఈ జాకెట్‌పై కూడా మంటలు అంటుకోకుండా జాకెట్‌ మరో లేపనం రాశారు.దీంతో కాగడాలతో నిప్పు పెట్టగానే కేవలం జాకెట్‌పై పూసిన లేపనం మాత్రం అంటుకుంది.బ్యాక్ స్టేజ్ కి రాగానే నేలపై బోర్లా పడుకున్నాడు. ఆ వెంటనే అతడిపై నీళ్లలో తడిపిన కంబళ్లను మూత వేసి మంటల్ని ఆర్పేశారు.కిలాడీ విన్యాసాలు చూసిన వైఫ్ ట్వింకిల్ మాత్రం కంగారు పడిపోయింది. ఇంటికొస్తే చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos