షూటింగులు లేక పండ్లు అమ్ముకుంటున్న నటుడు..

  • In Film
  • May 22, 2020
  • 199 Views
షూటింగులు లేక పండ్లు అమ్ముకుంటున్న నటుడు..

కరోనాతో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి.చదువులు పూర్తి చేసుకొని కొలువుల వేటలో పడడానికి సిద్ధమవుతున్న యువత నుంచి వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా కొత్త ఉద్యోగాలు రాక,అసలు ఉద్యోగాలే లేక లక్షలాది మంది రోడ్డున పడుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమల్లో సైతం ఇదే పరిస్థితులు తలెత్తాయి.షూటింగులు లేక చాలా మంది కార్మికులు,చిన్న చిన్న వేషాలతో ఉపాధి పొందుతున్న నటీనటులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.ఈ క్రమంలో బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌ తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన సోలంకి దివాకర్‌ అనే ఆర్టిస్టు ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ముంబయి రోడ్లపై పండ్లు విక్రయిస్తున్నాడు.దివాకర్‌ పండ్లు విక్రయిస్తున్న ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. డ్రీమ్ గర్ల్ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దివాకర్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 35 ఏళ్ల ఈ సినీ యాక్టర్ గతంలో పండ్ల వ్యాపారం చేశాడట. సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ బాట పట్టిన ఇతను చిన్న చిన్న అవకాశాలతో ఇన్నాళ్లు ఫ్యామిలీని నడుపుకుంటు వస్తున్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఇలా రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటున్నాడు.ఇంటి అద్దె కట్టుకొని నా ఫ్యామిలీని నడపాలి అంటే ఎదో ఒక పని చేయక తప్పదు. అందుకే ఈ విధంగా పండ్ల వ్యాపారం స్టార్ట్ చేశాను అని దివాకర్ చెబుతున్నారు. నెక్స్ట్ బాలీవుడ్ లో తెరకెక్కనున్న చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్స్ స్టార్ట్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడట ఈ యాక్టర్. కొన్ని సినిమాలు ఇప్పట్లో స్టార్ట్ కాకపోవచ్చని, మరికొన్ని క్యాన్సిల్ కావచ్చని కూడా చెప్పుకొచ్చాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos