న్యూఢిల్లీ : దేశంలో శనివారం రాత్రి 8.19 గంటలకు బ్లూ మూన్ సంభవించనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలం రంగులో కనబడతాడని కాదు. చందమామ సాధారణంగా కనబడే పసుపు, తెలుపు రంగుల్లో కాకుండా భిన్నంగా కనిపి స్తుంది. ఈ దఫా బ్లూ మూన్ కు ఇదో ప్రత్యేకత. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినపుడు రెండో పున్నమిని -బ్లూ మూన్ గా వ్యవహరిస్తారు. ఇది రెండు, మూడు సంవత్సరాలకోమారు వస్తుంది. బ్లూ మూన్ ను మళ్ళీ చూడగలిగేది 2039 లోనేనని శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం శరద్ పూర్ణమ, క్రైస్తవుల పండుగ- హాలోవీన్ కూడా.