హైదరాబాద్ బ్లడ్ బ్యాంకుల్లో తగ్గిపోతున్న నిల్వలు

హైదరాబాద్ బ్లడ్ బ్యాంకుల్లో తగ్గిపోతున్న నిల్వలు

హైదరాబాద్‌ : కరోనా భయంతో రక్తదాతలు ముందుకు రాకపోవండతో నగరంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. గతంలో ఏదో ఒక సామాజిక కార్యక్రమం పేరిట రక్త దాన శిబిరాలు నిర్వహించేవారు. తద్వారా బ్లడ్‌ బ్యాంకులకు రక్తం సంచులు వెళ్లేవి. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు, కళాశాలల్లో కూడా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిధ ఆస్పత్రులు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా రక్తాన్ని సేకరించి బ్లడ్‌ బ్యాంకులకు పంపిస్తూ ఉండేవి. కరోనా వైరస్‌ భయంతో ఇప్పుడు రక్తదాన శిబిరాలను నిర్వహించడం లేదు. ప్రస్తుతం రక్తం అందుబాటులో లేకపోవడంతో చిన్నారులు, తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు వైద్యాధికారి కేపీ. రెడ్డి తెలిపారు. ఈ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం రక్త మార్పిడి కేంద్రం నిర్వహిస్తుండగా, ప్రతి రోజూ 25 మందికి రక్త మార్పిడి చేస్తున్నారు. నగరంలోని ఇతర బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘తమ బంధువుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు రెండు రోజుల కిందట నిర్ణయించారు. పేషెంట్కు రక్తం అవసరమని చెప్పారు. కానీ ఇంతవరకు రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనుక శస్త్ర చికిత్స వాయిదా పడే అవకాశం ఉందని హైటెక్ సిటీ సమీపంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి బంధువు తెలిపారు. మరో వైపు తెలంగాణలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. హాలెండ్ నుంచి వచ్చిన 42 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి రక్త పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ ఉందని తేలింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos