మూఢభక్తులకు దుకాణంలోకి ప్రవేశం లేదు

మూఢభక్తులకు దుకాణంలోకి ప్రవేశం లేదు

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతు న్నాయి. ఈ నిరసనలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పంజాబ్, మోహాలీలో దుకాణదారులు అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. వారు తమ దుకాణాల ముందు రైతులకు మద్దతుగా పోస్టర్లు అతికించారు. వాటిపై… ‘మా దుకాణాలలోకి మూఢ భక్తులకు ప్రవేశం లేదని, మేము రైతులకు మద్దతు పలుకుతున్నాం’అని రాశారు. తమ దుకాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ పోస్టర్లు అతికించినట్లు వారు చెబుతున్నారు. కొంతకాలం కిందట ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రైతు సంఘాలను అభినందించారు. ఈ సందర్భంగా మొహాలీ రైతులు మార్కెట్లో మోదీ పోస్టర్ పెట్టారన్నారు. అయితే ఇప్పుడు రైతుల మొర పట్టించుకోని మోదీని అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. మొహాలీలోని దుకాణదారులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు.

తాజా సమాచారం