ఢిల్లీలో పేలుడు

ఢిల్లీలో పేలుడు

ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు దాటికి మూడు కార్లు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను పురస్కరించుకుని బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతున్న రాజ్‌పథ్‌కు కేవలం 1.4 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సంఘటనా స్థలంలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పూలకుండీలో పేలుడు సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద భారీగా భద్రతను పెంచారు. దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. పార్లమెంట్ సహా ఢిల్లీలోని అన్ని కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు పేలుడు ఘటన నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos