హైదరాబాదు: విద్యుత్ వాహనాలు ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్‌లు దగ్ధంకాగా సోమవారం వరంగల్‌లో మరో బైక్ అగ్నికి ఆహుతైంది. ఉదయం 6గంటలకు చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్ వద్ద నిలిపి ఉన్న విద్యుత్ వాహనం నుంచి మంటలు రేగాయి. మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లిథియం ఆయాన్ బ్యాటరీలది కీలక పాత్ర. తేలిక, అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్ వీటి ప్రత్యేక తలు. లిడ్ యాసిడ్లతో పోల్చి్తే సుమారు 6రెట్లు ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రమాదానికి కారణమని నిపుణుల అభిప్రాయం. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరో ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమ తించరు.ఏ బ్యాటరీలు ఎంత త్వరగా ఛార్జింగ్ అవుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఏథర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లిథియం అయాన్ బ్యాటరీకి వర్తిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ డిస్చార్జింగ్ రేటు. సామర్థ్యం, లైఫ్ సైకిల్, ఛార్జింగ్ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్ స్పష్టం చేసింది.