న్యూఢిల్లీ: విదేశీ బ్యాకు ఖాతాల్లో నల్లధనం ఎంతుందనే గణాంకాలు లేవని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సభ్యుడు ఒకరికి లిఖిత పూర్వకంగా తెలిపారు. 2015లో మూడు నెలల వన్–టైమ్ సెటిల్మెంట్ విండో కింద రూ. 2,476 కోట్లు పన్ను, జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నల్లధనం పన్ను చట్టం, 20 15 విధించడం కింద సెప్టెంబర్ 30, 2015తో ముగిసిన మూడు నెలల వన్ టైమ్ విండో కింద రూ. 4,164 కోట్ల విలువైన బహిర్గతం చేయని విదేశీ ఆస్తులు వెల్లడయినట్లు తెలిపారు. వీటి లావాదేవీల సంఖ్య 648.