గాజియాబాద్: కేంద్రం నూతన ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ తేల్చి చెప్పారు.రైతుల ఆందోళన ఆరంభమై ఆరు మాసాలు నేటితో ముగిసిన సందర్భంగా దేశ వ్యాప్తంగా నిరసన దినాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేసి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులైనా కేంద్రం తమను పట్టించుకోవడం లేదు. సరిహద్దులో రైతుల నిరసన బ్లాక్ డే రోజున ఇతర ప్రాంతాల రైతులు దిల్లీ సరిహద్దుకు రావడం లేదని, వారు ఉన్న చోటు నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేద’ని స్పష్టం చేశారు.