ముంబై: అజిత్ పవర్ను కమలనాధులు బ్లాక్ మెయిల్చేసినందునే ఆయన భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారని శివసేన ప్రముఖుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.‘ భాజపాకు మద్ద తు తెలుపుతోన్న మా పార్టీ నేత ధనంజయ్ ముండేతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. అజిత్ పవార్ కూడా తిరిగి మాతో కలిసే అవకాశం ఉంది. ఆయనను భాజపా నేతలు బ్లాక్ మెయిల్ చేశారు. అందుకే ఆయన ఇలా చేశారు. మా పార్టీ పత్రిక సామ్నాలో త్వరలోనే అన్ని వివరాల్ని బహిర్గతం చేస్తాం. అజిత్ పవార్ వెంట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వారి లో ఇప్పటికే ఐదుగురు తిరిగి మా వద్దకు వచ్చేశారు. తమను అపహరించి తీసుకెళ్లిన రీతిలో భాజపా వ్యవహరించిందని వారు అంటు న్నారు’ అని సంజయ్ రౌత్ వివరించారు. బీజేపీ బల నిరూపణలో నెగ్గుతుందా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెల కొం ది మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమా ణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.