ట్రెండింగ్‌లో బాయ్‌కట్ ఛపాక్ హ్యాష్‌ట్యాగ్..

  • In Film
  • January 8, 2020
  • 147 Views
ట్రెండింగ్‌లో బాయ్‌కట్ ఛపాక్ హ్యాష్‌ట్యాగ్..

గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ జేఎన్‌యూ వర్శిటీ విద్యార్థులను బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోణే పరామర్శించారు. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్తో పాటు ఆమె పలువురిని కలిశారు. విద్యార్థులు,అధ్యాపకులపై దాడి హేయమైన చర్యగా దీపికా అభివర్ణించారు.జేఎన్‌యూ వర్శిటీ విద్యార్థులను పరామర్శించడంతో దీపికాపై కొందరు సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇకపై దీపికా నటించే చిత్రాలను బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన విడుదల కానున్న యాసిడ్దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛపాక్ సినిమాను బ్యాన్చేయాలని నెటిజన్లు అంటున్నారు. వారు క్రియేట్చేసినబాయ్కట్ ఛపాక్అనే హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో ఉంది. జేఎన్యూకి ఎందుకు వెళ్లావు? అంటూ దీపికను ప్రశ్నిస్తున్నారు. తాము బుక్ చేసుకున్న టికెట్లను కొందరు రద్దు చేసుకొని వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos