కౌంటింగ్‌ కేంద్రాల్లో మూర్చబోయిన సిబ్బంది..

కౌంటింగ్‌ కేంద్రాల్లో మూర్చబోయిన సిబ్బంది..

ఇటీవల ముగిసిన పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ మొదలైన విషయం తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో 978 కౌంటింగ్‌ హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది.కాగా కౌంటింగ్ లో భాగంగా పలు చోట్ల అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.భూపాలపల్లిలో బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి పూర్తిగా పాడైపోగా నిజామాబాద్‌ కౌంటింగ్ కేంద్రంలో కనీస వసతులు కరువై ఉద్యోగులు మూర్చబోయారు. హృదయ పాఠశాల కౌంటింగ్‌ కేంద్రంలో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీరు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ముగ్గురు ఉద్యోగులు మూర్చబోయారు. దీంతో కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది.ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికీ షాక్‌లోనే ఉన్న నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు మరో షాక్ తగిలింది. తన స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి కె. రాజు విజయం సాధించారు. ఇప్పటికే ఎంపీగా కవిత ఓటమి పాలైంది.నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం పోతంగల్ కవిత స్వగ్రామం. కవిత భర్తది ఇదే గ్రామం. ప్రతి ఎన్నికల్లో కూడ కవిత నిజామాబాద్ జిల్లాలోనే తన భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొంటారు. తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పోతంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి కత్రోజి రాజు 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ తాను దత్తత తీసుకొన్న ఎర్రవెల్లి మండలం మర్కూక్ గ్రామంలో టీఆర్ఎస్  అభ్యర్ధి గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలంలోని రుద్రారం ఎంపీటీసీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకొంది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos