జైపూర్ : ముఖ్యమంత్రి గెహ్లాట్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్పై కాంగ్రెస్ పార్టీ సోమవారం విమర్శల దాడిని పెంచింది. ‘సచిన్ పైలెట్ ప్రస్తుతం భాజపాతో ఉన్నార’ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ.ఎల్. పూనియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో భాజపా వైఖరి ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిందేనన్నారు. ‘భాజపా నుంచి మాకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్తను, నేతను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంద’ని పూనియా ప్రకటించారు.