రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్చాలని ఈసీకి బీజేపీ లేఖ

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు బీజేపీ లేఖ రాయనుంది. షెడ్యూల్ ప్రకారం 200 అసెంబ్లీ స్థానాలకు లో నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ సోమవారం ప్రకటించింది. ఆ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుకునే కార్తీక శుద్ధ ఏకాదశి కావడం, అదే రోజు 45,000కు పైగా పెళ్లిళ్లు రాష్ట్రంలో జరుగనుండటంతో పోలింగ్ శాతంపై వీటి ప్రభావం పడుతుందని బీజేపీ అంటోంది. ఇందువల్ల వ్యాపార వర్గాలు సైతం ఓటింగ్కు హాజరయ్యే అవకాశం ఉండదని చెబుతోంది. పెళ్లిళ్లకు ఇప్పటికే వెడ్డింగ్ హాల్స్ బుక్ కావడంతో ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతోంది. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకురానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos