అమరావతి: సీఎం చంద్రబాబుకు తామెంతో సహకరిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. కానీ తమను నిత్యం విమర్శిస్తున్నారని, పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు తన సొంతంగా చూస్తున్నారని దుయ్యబట్టారు. స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ, నోట్ల రద్దుతో పారదర్శకత పెరిగిందని, దేశంలో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగిందని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. రూ.6వేలు పెట్టుబడి సాయం సాహసోపేత నిర్ణయమని కేంద్రాన్ని కన్నా కొనియాడారు. రైతుబంధుకు, కేంద్ర పథకానికి తేడా ఉందని ఆయన చెప్పారు. ఏపీకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మీడియా సమావేశంలో ఆ ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు చింపేశారు.