హొసూరు : హొసూరు మాజీ ఎమ్మెల్యే, ఐఎన్‌టీయూసీ నాయకుడు కేఏ. మనోహరన్ పుట్టిన రోజు పండుగను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హొసూరులోని ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కామరాజు కాలనీలోని ఆయన కార్యాలయం వద్ద వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మనోహరన్‌కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.